పొగ కమ్మేయడంతో ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు | - | Sakshi
Sakshi News home page

పొగ కమ్మేయడంతో ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు

May 23 2026 12:22 AM | Updated on May 23 2026 12:22 AM

వైరారూరల్‌: మండలంలోని గొల్లపూడి – పాలడుగు గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో వరి కోతలు పూర్తిచేసిన రైతులు వ్యర్థాల నిర్మూలనకు మంట పెట్టగా సుమారు 30 ఎకరాల పొలాలకు నిప్పంటుకోవడమేకాక ఆరు ఎకరాల మేర నర్సరీ కాలిపోయింది. దీంతో వైరా – జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ క్రమాన హైదరాబాద్‌ నుంచి మధిర వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆగిన ఆయిల్‌ ట్యాంకర్‌ను పొగ కారణంగా గుర్తించక ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వైరా ఎస్‌ఐ పి.రామారావు, సిబ్బందితో చేరుకుని క్షత్రగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆపై అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పగా, రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement