రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం | - | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం

May 22 2026 12:42 AM | Updated on May 22 2026 12:42 AM

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదైంది. మధ్యాహ్నం 3గంటల సమయాన గరిష్టంగా 102 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరగగా, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఇదే అత్యధికమని శాఖ ప్రకటించింది. గత ఏడాది మే 21న 95ఎండబ్ల్యూ విద్యు త్‌ వినియోగం జరగగా, ఈ ఏడాది అంతకు మించి ఏడు మెగావాట్ల(7.37శాతం) విద్యుత్‌ వినియోగం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఎనిమిది విద్యుత్‌ సెక్షన్ల గాను 1.50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహావసరాలవే కాక వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లు కూడా అధికంగానే ఉంటాయి.

ఎండ తీవ్రతతోనే..

జిల్లాలో రెండు రోజులుగా గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఖమ్మంలో 46.2 డిగ్రీలుగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. వడగాలులతో బయటకు రాలేక ఇళ్లలో ఉంటుండడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియో గం పెరిగి.. అదే స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదవుతుంది. ఈ సందర్భంగా ఖమ్మం టౌన్‌ డీఈ(ఆపరేషన్స్‌) నంబూరి రామారావు మాట్లాడు తూ ఎండ తీవ్రత కారణంగా అవసరమైన ఉపకరణాలను వినియోగించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతున్నా, ఈ సమయాన ఇతర విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

మధ్యాహ్నం 3గంటలకు

102మెగావాట్లుగా నమోదు

Advertisement
 
Advertisement
Advertisement