ఇల్లెందు లేక్ వ్యూ పార్క్‌లోని ఈత కొలనులో చాన్నాళ్ల తర్వాత సందడి మొదలైంది.
మున్సిపాలిటీ నిధులు రూ.కోటితో కొలనును నిర్మించారు. గత ఏడాది నిర్వహణ సాఫీగానే సాగినా ఆ తర్వాత మూత పడింది. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మళ్లీ తెరిపించి
పర్యవేక్షణను ఒకరికి అప్పగించారు. దీంతో వారం నుంచి చిన్నాపెద్ద తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు కొత్తగా ఈత నేర్చుకుంటుండగా.. ఇప్పటికే ఈత వచ్చిన మరికొందరు దాన్ని కొనసాగిస్తున్నారు. – ఇల్లెందు


