ఖమ్మంఅర్బన్: ఖమ్మం 15వ డివిజన్ కొత్తగూడెంకు చెందిన నారసాని రమణనాయుడు(28) గురువారం బావిలో ఈతకు వెళ్లగా నీట మునిగి మృతి చెందాడు. కొత్తగూడెం – అల్లీపురం మధ్య వ్యవసాయ బావిలో ఈత కోసం రమణతో ఎనిమిది మంది వెళ్లారు. కొద్దిసేపటికి అందరూ ఒడ్డుకు చేరుకోగా, నాయుడు మరోసారి ఈతకు దిగినట్లు తెలిసింది. ఆతర్వాత బయటకు రాకపోవడంతో మిత్రులు గాలిస్తూనే కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చేరుకుని గాలింపు చేపట్టారు. ఇదే సమయాన పోలీ సులు కూడా చేరుకున్నారు. చివరకు రాత్రి పొద్దుపోయాక ఆయన మృతదేహం బయటపడింది. రమణనాయుడు తల్లిదండ్రులు మృతి చెందగా, చెల్లెలితో కలిసి ఆయన నాయనమ్మ వద్ద ఉంటున్నాడు.


