ముందస్తు జాగ్రత్తలతోనే... | - | Sakshi
Sakshi News home page

ముందస్తు జాగ్రత్తలతోనే...

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

8లో

న్యూస్‌రీల్‌

గౌరారం, ఐడీఓసీ ప్రాంతాల్లో

అత్యధికంగా 46.3 డిగ్రీలు

28 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత

వేడిగాలులు, ఉక్కపోతతో

జనం ఉక్కిరిబిక్కిరి

వరదల వంటి విపత్తుల నివారణకు ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలే కీలకమని కలెక్టర్‌ దివాకర తెలిపారు.

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

భగ్గుమంటోంది..

బయటకు రావాలంటే భయమే...

ఈ వేసవిలో మార్చి నుంచే భానుడి ప్రతాపం ప్రారంభమైంది. సహజంగా మార్చిలో ఎండ సాధారణంగానే నమోదై, ఏప్రిల్‌లో తీవ్రత పెరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 40 – 42 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎండ తీవ్రత ఉన్నా గాలిలో తేమశాతం ఉండడంతో ఇబ్బందులు ఉండేవి కావు. ఈసారి మాత్రం తీవ్రమైన ఉక్కపోత, వడగాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం 7గంటల నుంచి ఎండ మొదలై 11 గంటల తర్వాత గరిష్ట స్థాయికి చేరుతోంది. ఇక రాత్రి 10 గంటలు దాటినా వేడిగాలులు తగ్గడం లేదు. ఫలితంగా ప్రయాణాలు చేసే వారు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇళ్లలో ఉన్నా ఫ్యాన్లు, కూలర్లు ఏ మాత్రం ఊరటనివ్వడం లేదు.

ఈనెల మొదటి నుంచే..

మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో విపరీతంగా ఉన్న ఎండలు.. మే వచ్చే వరకు మరింతగా పెరిగాయి. ఈ నెలలో దాదాపు ప్రతినిత్యం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో అకాల వర్షాలతో ప్రజలు వేసవిలో ఉపశమనం లభించేది. కానీ ఈసారి ఒకటి, రెండు సార్లు కొద్దిపాటి వర్షం మినహా అకాల వర్షాలు లేకపోవడంతో వేడి, వడగాలులు వేధిస్తున్నాయి.

రెండు డిగ్రీలు పెరిగి..

వాతావరణ శాఖ రెండు, మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే మంగళ, బుధవారాల్లో భానుడు నిప్పులు చెరిగాడు. బుధవారం అత్యధికంగా రెండు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 42 వెదర్‌ స్టేషన్లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడం, 28 వెదర్‌స్టేషన్ల వద్ద రెడ్‌ ఎలర్ట్‌ స్థాయలో నమోదు కావడం గమనార్హం. ఈమేరకు రానున్న నాలుగైదు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు

Advertisement
 
Advertisement
Advertisement