‘స్వచ్ఛ’ నిధుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ నిధుల వెల్లువ

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

● ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లకు మంజూరు ● జాబితాలో ఐదు మున్సిపాలిటీలు కూడా..

● ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లకు మంజూరు ● జాబితాలో ఐదు మున్సిపాలిటీలు కూడా..

ఖమ్మంమయూరిసెంటర్‌: ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌(అర్బన్‌) 2.0 కింద వివిధ అభివృద్ధి పనుల కోసం రాష్ట్రప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లతో పాటు వివిధ మున్సిపాలిటీలకు ఈ నిధుల కేటాయింపు జరిగింది. మున్సిపల్‌ పరిపాలనా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డీఆర్‌సీసీ, డంపింగ్‌ యార్డుల్లో నిర్మాణ సామర్థాల పెంపు, సమాచార – విద్య – సమాజ భాగస్వామ్య ప్రచారం, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ నిధులను కేటాయించారు. కాగా, బడ్జెట్‌ను నిర్దేశించిన విభాగాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ నిధుల విడుదలతో ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో స్వచ్ఛత పనులు వేగవంతం కానున్నాయి. నిధుల్లో అత్యధికంగా ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.95లక్షలు, ఆతర్వాత కొత్తగూడెం కార్పొరేషన్‌కు 79లక్షలు కేటాయించారు. ఇక మున్సిపాలిటీల్లో ఇల్లెందుకు రూ.77లక్షలు, మధిరకు రూ.27.20లక్షలు, మణుగూరుకు రూ.20.05లక్షలు, సత్తుపల్లికి రూ.18లక్షలు, వైరాకు రూ.10లక్షలు మంజూరయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement