కరకగూడెం: ఒక అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది. చాలా చురుకు గా ఉండే ఈ కుందేలుకు ఒక చెడు అలవాటు కూడా ఉంది. ఎవరినైనా చూసినా చిన్నచూపు చూడడం, వెక్కిరించడం చేసేది. అడవిలోని జంతువులన్నీ దాని మాటలకు బాధపడేవి. ఓరోజు సాయంత్రం అడవిలో భారీ వర్షం వచ్చింది. గాలి బలంగా వీస్తూ చీకటి కమ్మేసింది. దీతో కుందేలు తన గూటికి వెళ్లే దారి మర్చిపోయింది. ఎంత పరుగెత్తినా దారి కనిపించక ఇప్పుడు ఏం చేయాలంటూ భయంతో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే దగ్గరలో చిన్నగా వెలుగు కనిపించింది. అది ఒక మిణుగురుపురుగు. కుందేలమ్మా ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది. నా గూటికి వెళ్లే దారి కనిపించడం లేదు.. నువ్వు నాకు సాయం చేస్తావా అని కుందేలు వేడుకుంది. దీంతో మిణుగురు పురుగు నవ్వుతూ నేను చిన్నదాన్నేకావచ్చు.. కానీ నా వెలుగు నీకు దారి చూపుతుంది. నాతో రా అంటూ ముందుగా ఎగురుతూ వెళ్లింది. ఆ వెనుకాల కుందేలు వెళ్తూ కొద్దిసేపటికి గూటి వద్ద చేరుకుంది. ఆనందంతో నువ్వు ఎంత చిన్నదానివైనా నాకు పెద్దసాయం చేశావు. నేనునిన్ను ఎప్పు డూ చిన్నచూపు చూసేదాన్ని.. నన్ను క్షమించు అంది. అంతేకాక ఆ రోజు నుంచి కుందేలు ఎవరినీ తక్కువగా చూడకుండా అందరితో మంచిగా ఉండసాగింది.


