స్టాక్‌ పాయింట్లలో డీఎం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

స్టాక్‌ పాయింట్లలో డీఎం తనిఖీ

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

కారేపల్లి: రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను భద్రపరుస్తున్న స్టాక్‌ పాయింట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్‌ శాఖ డీఎం జె.నరేందర్‌ మంగళవారం తనిఖీ చేశారు. కారేపల్లి మండలంలోని అప్పాయిగూడెం గోదాముతో పాటు జిన్నింగ్‌ మిల్‌ స్టాక్‌ పాయింట్లను ఆయన పరిశీలించారు. కారేపల్లిలో సోమవారం రాత్రి రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యాన వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మొక్కజొన్నలను స్థానికంగానే దిగుమతి చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు. దీంతో డీఎం గోదాంలను పరిశీలించి నిల్వకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సొసైటీ డైరెక్టర్‌ అడ్డగోడ ఐలయ్యతో పాటు బొంతు రాంబాబు, బొల్లు హన్మంతరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement