స్నేహితుడి కుటుంబానికి అండగా.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడి కుటుంబానికి అండగా..

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

కుమార్తె వివాహానికి రూ.5.60 లక్షలు

ఖమ్మంమామిళ్లగూడెం: కలిసి చదువుకున్న స్నేహితుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా, ఆ బంధాన్ని మరిచిపోకుండా ఆయన కుమార్తె వివాహానికి అండగా నిలిచి మిత్రధర్మాన్ని చాటిచెప్పారు. ఖమ్మానికి చెందిన మున్సిపాలిటీ ఉద్యోగి ఎండీ మహబూబ్‌అలీ 2013లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుమార్తెకు వివాహనం నిశ్చయమైంది. దీంతో ఖమ్మం జమ్మిబండలోని జ్యోతి బాలమందిర్‌ 1986–87 బ్యాచ్‌లో మహబూబ్‌తో కలిసి చదువుకున్న వారు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తలా కొంత జమ చేయగా సమకూరిన రూ.5.60 లక్షలను మంగళవారం ఖమ్మంలో జరిగిన మహబూబ్‌ కుమార్తె వివాహంలో అందజేశారు. ఎన్‌ఆర్‌ఐలైన డాక్టర్‌ సుధాకర్‌, నాగుబండి ముత్యాలరావు, చింతలపూడి శ్రీకాంత్‌, ఎం.మాధవి, శివాజీతో పాటు స్థానికంగా ఉంటున్న డాక్టర్‌ రామరాజు, ఆర్‌.సత్యనారాయణ, పవన్‌ తదితరులు ఈ నగదు సమకూర్చగా పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement