అందరి దృష్టి కంప్యూటర్‌పై! | - | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి కంప్యూటర్‌పై!

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

ఉత్సాహంగా ఉంది.. ముందుగానే నేర్చుకునేలా.. బేసిక్‌ కోర్సులే కాక..

ఖమ్మంసహకారనగర్‌: ఆధునిక యుగంలో రోజురోజుకూ కంప్యూటర్‌ వినియోగం పెరుగుతోంది. కార్యాలయాలు, వ్యాపారాల్లోనే కాక చదువులోనూ కంప్యూటర్‌ కీలకంగా మారింది. ఈనేపథ్యాన పాఠశాలల విద్యార్థుల్లో వేసవి సెలవుల్లో కంప్యూటర్ల ప్రాథమిక కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనేపథ్యాన కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్లలో సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా.. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులు నేర్చుకుంటున్నారు.

కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థులు

కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటున్నా. కొత్త విషయాలు తెలుసుకుంటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ కోర్సుల వల్ల భవిష్యత్‌లో మంచి ఉపయోగం ఉంటుందని చెప్పారు. సెలవులు వృథా కాకుండా శిక్షణకు హాజరవుతున్నాను.

–ఫర్హాన్‌, విద్యార్థి

పాఠశాలల్లో కంప్యూటర్‌ కోర్సులు నేర్పిస్తారు. కానీ అందరితో పాటే నేర్చుకునే క్రమాన ఇబ్బంది కావొద్దని ముందుగానే శిక్షణ తీసుకుంటున్నా. పాఠశాల స్థాయి నుంచే నేర్చుకుంటే పెద్ద చదువులకు వెళ్లేటప్పటికి ఇబ్బంది కాదని చెబుతున్నారు. –నయోనిక, విద్యార్థిని

Advertisement
 
Advertisement
Advertisement