ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి..

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: యుద్ధాల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడమే పుచ్చలపల్లి సుందరయ్యకు ఇచ్చే ఘన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించాక నాగేశ్వరరావు మాట్లాడారు. క్రూడాయిల్‌ ధరలు పెరిగినప్పుడు ఇంధన ధరలు పెంచుతున్న ప్రభుత్వం, తగ్గినప్పుడు మాత్రం స్పందించడం లేదన్నారు. అంతేకాక ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని సూచించడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, బండి రమేశ్‌, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్‌, పి.ఝాన్సీ, బండారు రమేశ్‌, తుమ్మ విష్ణువర్దన్‌, నెల్లూరి వీరబాబు, ఆర్‌.ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, సీపీఎం త్రీటౌన్‌ కమిటీ ఆధ్వర్యాన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వై.విక్రమ్‌, నాయకులు యర్రా శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు మాట్లాడగా మాజీ కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావ్‌, పార్టీ నాయకులు బండారు రమేశ్‌, వజినేపల్లి శ్రీనివాసరావు, పత్తిపాక నాగసులోచన, ఎస్‌కే సైదులు, యర్రా మల్లికార్జున్‌, ఎస్‌కే ఇమామ్‌ పాల్గొన్నారు.

తద్వారా సుందరయ్యకు నివాళి

Advertisement
 
Advertisement
Advertisement