హాలిడే ట్రిప్‌.. | - | Sakshi
Sakshi News home page

హాలిడే ట్రిప్‌..

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

హాలిడే ట్రిప్‌..

హలో ఫ్రెండ్స్‌. నా పేరు కురసం కల్పన. సత్తుపల్లిలో 8వ తరగతి చదువుతున్న నేను, మా కుటుంబం వేసవి సెలవుల్లో హైదరాబాద్‌ వెళ్లాం. అక్కడ ముందుగా చార్మినార్‌ చూశాం. శతాబ్దాల నాటి ఈ కట్టడం చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యా. అంతేకాక గోల్కొండ కోటను కూడా సందర్శించాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని చూశా. ట్యాంక్‌బండ్‌తో పాటు హుస్సేన్‌సాగర్‌లో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని చూశాం. గతంలోనూ హైదరాబాద్‌ వెళ్లినా, ఇవన్నీ చూడడం ఇదే మొదటిసారి. మీరు కూడా వేసవి సెలవుల్లో ఎక్కడెక్కడకు వెళ్లారో ఆ వివరాలను అందరితో పంచుకోండి.

–సత్తుపల్లిటౌన్‌

Advertisement
 
Advertisement
Advertisement