వేసవి వచ్చిందంటే ఈత కొట్టేందుకు యువకులు ఉత్సాహం చూపుతారు. పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నా గ్రామాల్లో మాత్రం వ్యవసాయ బావులనే ఎంచుకుంటారు. సెలవులు తోడవడంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈత నేర్చుకునేందుకు బావుల వద్ద బారులు దీరుతున్నారు. ఈక్రమాన పిల్లలకు క్యాన్లు కట్టి మెళకువలు నేర్పిస్తున్న పెద్దలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, పెద్దలు ఈత కొడుతున్న దృశ్యాలే ఇవి.
– తిరుమలాయపాలెం


