వేంసూరు/కల్లూరు/సత్తుపల్లిరూరల్: పలు మండలాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను అధికారులు సోమవారం సందర్శించారు. వేంసూరు మండలంలోని కందుకూరు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సోమవారం జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. హెచ్‌ఎం బొంతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే, కల్లూరులోని శిబిరాన్ని ఏఎంఓ పి.ప్రభాకర్‌రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంఈఓ పి.నివేదిత సందర్శించి, విద్యార్థులకు సూచనలు చేశారు. కోచ్ వీరరాఘవయ్య పాల్గొన్నారు. అలాగే, సత్తుపల్లి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిబిరాన్ని ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. హెచ్‌ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు వెంకటేశ్, శ్రీను, చిట్టికుమారి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


