ఖమ్మంరూరల్: వాహనదారులంతా రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణంపై అవగాహన పెంచుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్‌రోడ్డులో సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో పరిశీలిస్తే ఎక్కువగా మానవ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నట్లు తేలిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి వాటితో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని చెప్పారు. ఈమేరకు వాహనదారులకు అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐ ముష్క రాజు, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
ఖమ్మం మామిళ్లగూడెం: నిబంధనలు పాటిస్తూనే రహదారి భద్రతను అందరూ బాధ్యతగా భావించాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, రవాణా శాఖ అధికారి దినేష్ సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం ‘అరైవ్ – అలీవ్’ పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి మయూరి సెంటర్ మీదుగా బస్ డిపో వరకు సాగిన ర్యాలీలో వారు మాట్లాడారు. ఆర్టీసీ ఖమ్మం డీఎం శివప్రసాద్, ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


