వైరా: అకారణంగా తమను కొట్టి గాయపరిచారని వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడుకు చెందిన పొన్నెకంటి కుసుమాంబ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనతోపాటు భర్త సత్యనారాయణ, కుమారుడు సునీల్‌పై కక్ష పెంచుకున్న మాజీ వార్డు కౌన్సిలర్ భర్త కర్నాటి హన్మంతరావు, ఆయన తమ్ముడు రవి అకారణంగా తమ కుమారుడిని కొట్టారని తెలిపారు. దీనిని అడ్డుకోగా తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని వెల్లడించింది. ఘటనతో తన చేయి విరగగా పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.


