ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది. ఖమ్మం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద శిబిరాన్ని వివిధ సంఘాల నాయకులు మందపాటి సత్యనారాయణరెడ్డి, సీతారాం గోపాల్, ఆర్.సత్యనారాయణ, నాగేంద్రకుమార్, టి.శేషగిరిరావు, వెంకటరమణారెడ్డి, సురేష్, శ్రీనివాస్, రమేష్, నాగేశ్వరరావు, ఎం.ప్రసాద్, కోక్యానాయక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీనర్ అన్వర్ పాషా ఆధ్వర్యాన జరుగుతున్న సమ్మెలో సురేందర్‌రెడ్డి, ఉపేందర్, రామకృష్ణ, దాసు, రామ్మోహన్, అజారుద్దీన్, నరసింహారావు, వెంకటరెడ్డి, మంగ్యానాయక్, సైదులు, నరేష్, నాగరాజు, మోబిన్, రమాదేవి, నాగలక్ష్మి, సంధ్యారాణి, నస్రీన్, రవి, భద్రు, అనంతయ్య, సురేష్, జానీ పాల్గొన్నారు.
● ఖమ్మం మామిళ్లగూడెం: న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సమ్మె శిబిరాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వాకదాని రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


