తిరుమలాయపాలెం: కలిసి చదువుకున్న వారిలో ఎవరైనా విధి వక్రీకరించి ప్రాణాలు కోల్పోతే వారి పిల్లల చదువులకు గాను పూర్వ విద్యార్థులు అండగా నిలుస్తున్నారు. మండలంలోని పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994–95 బ్యాచ్ విద్యార్థులు 2009లో కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఈ బ్యాచ్‌కు చెందిన ఐతనబోయిన రవికుమార్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుమార్తె మైత్రి పేరిట రూ.26వేల ఫిక్స్‌్‌డ్ డిపాజిట్ బాండ్‌ను సోమవారం అందజేశారు. గతంలో రూ.1.50లక్షలతో పాఠశాలలో వేదిక నిర్మించగా, 2019లో పెరుగు ఉపేందర్ కుమార్తె పేరిట రూ. 42 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ అందించారు. ఈ కార్యక్రమంలో మీగడ సైదులు, మేకల సత్యనారాయణ, మడికంటి స్కైలాబ్, రామనబోయిన వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, భాషబోయిన వీరభద్రం పాల్గొన్నారు.


