ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని స్టెమ్‌స్పార్క్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు కొండా శ్రీధర్‌రావు, కొండా కృష్ణవేణి తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీసీలో 470మార్కులకు బి.ప్రతిభ, పి.శ్రావ్య, పీఎల్.శరత్‌చంద్ర, జి.గణేష్ 467మార్కులు, కె.గాయత్రి తన్విష, డి.అఖిల్, సీ.హెచ్.హాసిని, జి.ధనుష్ కుమార్, జి.అనీష్‌రెడ్డి, షేక్ మహమ్మద్ ఆసిన్,బి. విశాలాక్షి 466మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వేయి మార్కులకు వై.అక్షిత 992మార్కులు, ఏ.భానుతేజ, సీ.హెచ్.వీ.సాయి పవన్ 989, సీ.హెచ్.గాయత్రి 987, సీ.హెచ్. హిమజ 986మార్కులు సాధించారని తెలిపారు.


