భక్తిశ్రద్ధలతో నదీ హారతి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో నదీ హారతి

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలోని గోదావరి తీరం ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పురోహితుడు రవికుమార్‌ ఆధ్వర్యంలో వేద పండితులు గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన గావించారు. భక్తి శ్రద్ధలత నదీ హారతి సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సేవా లక్ష్మీనారాయణ దంపతులు, వారణాసి, కాశీ ప్రాంతాలకు చెందిన రిషికేశ్‌–సరిత, రాజేష్‌–అనామిక, అంజుకుమారి కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భద్రాచలం రెడీమేడ్‌ బట్టల షాప్స్‌ అసోసియేషన్‌ వారు పూజా సామగ్రి సమకూర్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్‌ శర్మ, అశోక్‌ కుమార్‌ శర్మ పాల్గొన్నారు.

రామయ్యకు స్వర్ణ పుష్పార్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరి పారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement