జిల్లా వాసికి ‘వీరశౌర్య దివస్‌’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వాసికి ‘వీరశౌర్య దివస్‌’ అవార్డు

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

ప్రధాని చేతుల మీదుగా

అందుకున్న నూతనప్రసాద్‌

నేలకొండపల్లి: మండలంలోని మంగాపుర తండాకు చెందిన ఆర్మీ జవాన్‌ భూక్యా నూతనప్రసాద్‌ విధినిర్వహణలో ప్రతిభకు గాను గుర్తింపు లభించింది. 2024లో మణిపూర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడులను తిప్పికొట్టటంలో ఆయన ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నూతనప్రసాద్‌కు కేంద్రప్రభుత్వం వీరశౌర్య దివస్‌ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయనకు అవార్డు అందజేయగా కుటుంబీకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement