చుట్టూ ట్రాక్‌.. మధ్యలో ఫీల్డ్‌! | - | Sakshi
Sakshi News home page

చుట్టూ ట్రాక్‌.. మధ్యలో ఫీల్డ్‌!

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ పనులు చివరి దశకు చేరాయి. ఇదేసమయాన ట్రాక్‌ మధ్యలో ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌ ఏర్పాటు పనులు కూడా చేపడుతున్నారు. జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడకు మంచి ఆదరణ ఉండడంతో అధికారులు ఈనిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తాచాటగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే 60మందికి పైగా శిక్షణ పొందు తూ పోటీల్లో రాణిస్తున్నారు. ఈనేపథ్యాన వీరికి మెరుగైన శిక్షణ అందేలా అథ్లెటిక్‌ ట్రాక్‌మధ్యలో 100 మీటర్ల పొడవు, వెడల్పుతో గడ్డి అమర్చి.. సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 15 లక్షల వెచ్చిస్తున్నట్లు తెలియగా త్వరలోనే ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది.

ఫుట్‌బాల్‌ క్రీడాకారుల కోసం ఏర్పాటు

Advertisement
 
Advertisement
Advertisement