కొణిజర్ల: విద్యార్థులు శ్రద్ధగా చదివి లక్ష్యాలను చేరాక సామాజిక సేవకు కూడా సమయం కేటాయించాలని శ్రీకవిత విద్యాసంస్థల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్‌కుమార్ సూచించారు. తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్ట్ ఆవిష్కార్–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని తెలిపారు. కాగా, ఫెస్ట్‌లో ‘దివానా’ సినిమా హీరో హర్షిత్ రెడ్డి, హీరో స్నేహితులుగా నటించిన నర్సింగ్, శివరామ్ పాల్గొని విద్యార్ధులతో సందడి చేయగా సినీ గాయకులు పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల వైస్ చైర్మన్ పారుపల్లి విజయలక్ష్మి, డైరెక్టర్ శ్రీకవిత పారుపల్లి ఎర్రా, ప్రిన్సిపాల్ వి.చిన్నయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయేషా తరుణమ్, డీన్లు డాక్టర్ డి.శ్రీనివాసరావు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ ఫరీద్‌బాబా తదితరులు పాల్గొన్నారు.
శ్రీకవిత విద్యాసంస్థల చైర్మన్
ఉషాకిరణ్‌కుమార్


