సంతగుడి ఆవరణలో సంత యథాతథం | - | Sakshi
Sakshi News home page

సంతగుడి ఆవరణలో సంత యథాతథం

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

కారేపల్లి: దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కారేపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి (సంతగుడి) దేవస్థానం ప్రాంగణంలో ప్రతీ ఆదివారం జరిగే వారాంతపు సంత యథావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈఓ కె.వేణుగోపాలాచార్యులు, సింగరేణి గ్రామ కార్యదర్శి నెహ్రూ తెలిపారు. సంత ఆదాయంలో 15 శాతం గ్రామపంచాయతీకి చెల్లించాల్సి ఉండగా 2014 నుంచి రూ.3.52 లక్షలు బకాయి పేరుకుపోయింది. ఈ బకాయి చెల్లించకపోతే 12వ తేదీన సంత నిలిపివేస్తామని జీపీ నుంచి నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యాన శనివారం సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మేదరి టోనీవీరప్రతాప్‌తో పాటు పాలక వర్గం, దేవాదాయ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో భాగంగా దేవాదాయ శాఖ నుంచి రూ.2 లక్షలను రెండు దఫాలుగా చెల్లిస్తామని చెప్పడంతో అంగీకరించారు. దీంతో సంత నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. సమావేశంలో ఉప సర్పంచ్‌ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, ఉద్యోగులు పగడాల మోహన్‌కృష్ణ, మూడ్‌ మోహన్‌చౌహాన్‌, వార్డు సభ్యులు ఆదెర్ల అంజయ్య, యాకూబ్‌ అలీ, రావుల రాజశేఖర్‌, భూమిక, రాధ తదితరులు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ, జీపీ పాలకవర్గం మధ్య చర్చలు సఫలం

Advertisement
 
Advertisement
Advertisement