మిల్లర్ల వైపే మొగ్గు.. | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల వైపే మొగ్గు..

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

వరి సాగు, దిగుబడి అంచనా వివరాలు మిల్లులోనే విక్రయించా..

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు

వేచి ఉండలేక..

ప్రారంభించిందే తక్కువ కేంద్రాలు.. అందులోనూ ఊపందుకోని వైనం కొనుగోలు చేసినా క్వింటాకు రూ.2,389 చెల్లింపు మిల్లుకు వెళ్తే షరతులు లేకుండా రూ.2,450 ధర

రకం సాగు (ఎకరాల్లో) దిగుబడి అంచనా

(మె.టన్నుల్లో)

దొడ్డు రకం 92,770 2,62,802

సన్న రకం 1,39,157 3,37,889

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా.. కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మొత్తం 306 కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించగా.. ఇప్పటివరకు 136 కేంద్రాలే మొదలయ్యాయి. దీనికి తోడు మొదలైన కేంద్రాల్లోనూ కఠినమైన తేమ శాతం నిబంధనతో రైతులు మిల్లర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,389గా ఉండగా, మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా మెరుగైన ధర చెల్లిస్తుండడడం ఇందుకు కారణమవుతోంది.

అంచనాలకు మించి వరి సాగు

జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు గణనీయంగా వరి సాగు చేశారు. మొత్తం 2,28,434 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే అది కాస్తా 2,31,828 ఎకరాలకు చేరింది. చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడం, మిగతా చోట్ల భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉండడంతో వరి వైపు మొగ్గు చూపారు. మొత్తంగా జిల్లాలో 6,00,691 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో స్థానిక అవసరాలు, విత్తనాల కోసం 6,758 మెట్రిక్‌ టన్నులు, 3,56,360 మెట్రిక్‌ టన్నులను మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు చేస్తారని.. మిగతా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఈమేరకు 1,05,121 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం, 1,32,452 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం కలిపి 2,37,573 మెట్రిక్‌ టన్నులు సేకరించాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ నిర్ణయించుకుంది.

మార్చి నుంచే కోతలు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 306 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జిల్లాలో మార్చి నెలాఖరు నుంచే వరి కోతలు మొదలుకాగా, ఈనెల మొదటి వారం నుంచే కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటి వరకు 136 కేంద్రాలే ప్రారంభించగా కొనుగోళ్ల మాత్రం ఊపందుకోలేదు. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం, మంగాపురం తండా, రాజేశ్వరపురంల్లో కేంద్రాలను ప్రారంభించినా ఇప్పటివరకు గింజ కూడా కొనుగోలు చేయలేదు. అంతేకాక 17లోపు తేమ శాతానికి మించొద్దని, చెత్తాచెదారం లేకుండా పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఆధార్‌కార్డ్‌ జిరాక్స్‌తో రావాలని సూచిస్తున్నారు. అప్పుడే క్వింటాకు మద్దతు ధర రూ.2,389, కామన్‌ రకానికి రూ.2,369 దక్కుతుందని చెబుతున్నారు.

నాకు ఉన్న 15 ఎకరాల్లో వరి సాగు చేశా. అందులో 675 బస్తాలు దిగుబడి వచ్చింది. ఽకొనుగోలు కేంద్రానికి వెళ్లాలని అనుకున్నా అక్కడ తేమ శాతం కోసం పడిగాపులు కాయాల్సి ఉంటుంది. అందుకే పొలం నుంచి నేరుగా మిల్లుకే తీసుకెళ్లా. ధర కూడా సంతృప్తిగానే లభించింది.

– బాలిన కృష్ణంరాజు, రైతు, బైరవునిపల్లి

జెన్సీ ప్రతిపాదిత ఇప్పటివరకు

కేంద్రాలు ప్రారంభమైనవి

ఐకేపీ గ్రూపులు 115 78

పీఏసీఎస్‌ 151 50

డీసీఎంఎస్‌ 33 05

మెప్మా 07 03

మొత్తం 306 136

వరి కోతలు పూర్తి చేసిన రైతులు అమ్మకానికి మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లినా తేమ శాతం తదితర నిబంధనలతో రోజుల తరబడి ఆరబెట్టుకోవాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మరికొన్ని కేంద్రాల్లో ధాన్యం సేకరణే మొదలుకాలేదు. మరోపక్క మిల్లర్లు ఎలాంటి షరతులు లేకుండా చింట్లు రకం క్వింటాకు రూ.2,450, హెచ్‌ఎంటీ రకమైతే రూ.2,300 చెల్లిస్తున్నారు. ఈమేరకు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండడం కంటే మిల్లర్లకు అమ్మితేనే మేలనే భావనలో రైతులు అటే వెళ్తున్నారు.

ప్రభుత్వ కేంద్రాలపై ధాన్యం రైతుల నిరాసక్తత

Advertisement
 
Advertisement
Advertisement