పోలీసుల విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల విస్తృత తనిఖీలు

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

ఖమ్మంక్రైం: అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలు ఆరా తీసినట్లు సీపీ సునీల్‌దత్‌ శుక్రవారం వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కాగా, తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసుక, గంజాయి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, అక్రమంగా ఇసుక తరలించే లారీల బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇదే సమయాన మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారి గుర్తింపునకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement