ఖమ్మంవైద్యవిభాగం: ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం మామిళ్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 321 మందికి రక్త, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించి మందులు అందజేశారు. అంతేకాక మరో 15 మందిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డి.రామారావు, డాక్టర్ అరుణ పాల్గొనగా.. హోమియో ప్రాంతీయ సంచాలకురాలు ప్రమీల మాట్లాడుతూ.. హోమియోపతి విధానంలో ఇచ్చే మందులు శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి, తక్కువ దుష్ప్రభావాలతో సురక్షితమైన చికిత్సను అందిస్తాయని తెలిపారు. వైద్యులు పద్మావతి, ఉపేందర్, సుధాకర్, జ్యోతి, నస్రీన్, ప్రవీణ్, వెంకటలోస్, కృష్ణ చైతన్య, సంధ్య, సిబ్బంది రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


