ఖమ్మంవ్యవసాయం: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరింది. ఆర్టిజన్లు, అన్‌మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్లర్లు, పీస్ రేట్ వర్కర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ఖమ్మంలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో కార్మికులు ప్లకార్డులు ప్రదర్శించారు. యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పెద్ది భాస్కర్, బషీర్, వల్లాల యుగంధర్, విప్పా వేణు, మోహన్, టి.రామకృష్ణ, తెనాలి నరసింహారావు, పంకు రామకృష్ణ, బండారు నరేశ్, హరికృష్ణ, ఖైరున్నీసాబేగం, సంధ్యారాణి పాల్గొన్నారు.


