కూసుమంచి: కూసుమంచిలోని కెనరా బ్యాంకులో శుక్రవారం పొగలు వ్యాపించగా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. బ్యాంకు పనివేళలు ముగిశాక సిబ్బంది మూసివేసే క్రమాన షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అంతేకాక కొద్దిమేర మంటలు వ్యాపించి పేస్లిప్పులు కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఖమ్మం నుంచి వాహనంతో వచ్చిన సిబ్బంది బ్యాంకులో కమ్ముకున్న పొగను పైపుల ద్వారా బయటకు పంపించారు. ఆ తర్వాత మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టగా.. విలువైన పత్రాలకు నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


