చెదలు పట్టిన మాత్రలతో సదస్సు! | - | Sakshi
Sakshi News home page

చెదలు పట్టిన మాత్రలతో సదస్సు!

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

నేలకొండపల్లి: ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆరోగ్యంపై అవగాహన కోసం ఏర్పాటుచేసిన సదస్సులో చెదలు పట్టిన మాత్రలను ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. మండలంలోని మంగాపురంతండా జీపీ కార్యాలయంలో శుక్రవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె దవా ఖానా సిబ్బంది పలు రకాల మందులను ప్రదర్శించగా.. అందులో చాలా మందుల షీట్లకు చెదలు పట్టి ఉంది. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్‌ ధీరా వత్‌ అశోక్‌రాణి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెరువుమాధారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షుడు ధీరావత్‌ రాధాకృష్ణమూర్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పల్లె దవాఖానా వైద్యాధికారి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement