ఖమ్మం సహకారనగర్: ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అభ్యర్థులు https:// telanganaopenschool.org వెబ్‌సైట్ లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 80969 58096 నుంచి ‘హాయ్’ అని మెసేజ్ పంపించి హాల్‌టికెట్ పొందొచ్చని డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంగపతిరావు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఒరిజనల్ ఆధార్‌కార్డుతో పరీక్ష కేంద్రాలకు రావాలని సూచించారు.
వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్


