వైరాలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి అడుగులు | - | Sakshi
Sakshi News home page

వైరాలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి అడుగులు

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

వైరా: వైరాలో కొన్నేళ్ల నుంచి ప్రతిపాదనల దశలో ఉన్న షాపింగ్‌ క్లాంపెక్స్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత స్థలంలో ఏళ్ల క్రితం కొందరు షాపులు నిర్మించుకోగా, నాలుగేళ్ల క్రితం అధికారులు వాటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలో కొత్త కాంప్లెక్స్‌ నిర్మించాలని భావించినా.. ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించడంతో తొలగింపు అసంపూర్తిగా మిగిలిపోయింది. కోర్టులో పెండింగ్‌ ఉన్న ఈ కేసు పరిష్కారం దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన దుకాణాలనూ తొలగించి అక్కడ పాషింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించే అవకాశముంది. ఆపై కోర్టు సూచనల మేరకు టెండర్ల ద్వారా షాపులు కట్టబెడతారని తెలిసింది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వైరా క్రాస్‌ రోడ్డులోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించి షాపింగ్‌ క్లాంపెక్స్‌లు నిర్మిస్తామని, అర్హులందరికీ అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈనేపథ్యాన న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోయి క్లాంపెక్స్‌ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరగనుంది. అంతేకాక చిరువ్యాపారులకు సరైన అడ్డా లభిస్తుందని భావిస్తున్నారు.

పరిష్కారం దిశగా కోర్టు కేసులు

Advertisement
 
Advertisement
Advertisement