ఇంట్లో జారిపడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో జారిపడి మహిళ మృతి

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

ఖమ్మంక్రైం: ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడిన మహిళ మృతి చెందింది. ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మిరియాల నర్సయ్య–సక్కుబాయి(55) దంపతులు ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తాగునీటి కోసం కిచెన్‌లోకి వెళ్లగా లోబీపీకారణంగా కళ్లు తిరగడంతో గ్రానైట్‌ బల్లపై పడింది. ఈక్రమాన నుదుటిపై తీవ్రగాయమై రక్తస్రావంతో స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. అప్పుడు నిద్రలో ఉన్న నర్సయ్య గమనించకపోగా గురువారం ఉదయం లేచి ఆమెను పిలిచినా పలకకపోవడంతో స్థానికులను పిలిచేలోగా సక్కుబాయి మృతి చెందింది. టూటౌన్‌ సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రమేష్‌ పరిశీలించి కేసు నమోదు చేయగా, అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈమేరకు నర్సయ్య కుటుంబాన్ని పలువురు పోలీసు ఉద్యోగులు పరామర్శించారు.

గంజాయి స్వాధీనం

ఖమ్మం క్రైం: ఖమ్మం ప్రకాశ్‌నగర్‌ వద్ద గురువారం పోలీసుల చేపట్టిన తనిఖీల్లో గంజాయి లభ్యమైంది. అదే ప్రాంతానికి చెందిన సాయిశ్రీనివాస్‌ వద్ద 240 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు తెలిపారు. ఆయన వెంట ఓ మైనర్‌ కూడా ఉండగా కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement