ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టిజన్లు, అన్‌మ్యాన్డ్, స్పాట్ బిల్లర్లు, కలెక్షన్ ఏజెంట్లు, పీసు రేట్ కార్మికులు, స్టోర్ హమాలీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం రెండోరోజుకు చేరుకుంది. ఖమ్మంలోని ఖానాపురం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని యూనియన్ల నాయకులు టి.శేషగిరిరావు, ఎం ప్రసాద్, సీహెచ్.నాగార్జున సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించారు. జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీనర్లు అన్వర్ పాషా, పురుషోత్తమరావు, వెంకన్న, సురేందర్‌రెడ్డి, రామకృష్ణ, ఉపేందర్, రవి, రామ్మోహన్, మంగ్యానాయక్, నస్రీన్ సుల్తానా, ఖైరున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్మికులు విధులను బహిష్కరించడంతో విద్యుత్ సరఫరా నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెండో రోజుకు చేరిన సమ్మె


