పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులకు శిక్షణ

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయో ప్లాక్‌ విధానంలో చేపల సాగు’ అంశంపై రైతులకు ఇచ్చే శిక్షణ గురువారం మొదలైంది. ఖమ్మంతో పాటు సూర్యాపేట, వనపర్తి, జగిత్యాల జిల్లాల మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొనగా తొలిరోజు శిక్షణను సూర్యాపేట జిల్లా పశు సంవర్థక అధికారి డాక్టర్‌ బి.శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. బయోప్లాక్‌ విధానంలో చేపల పెంపకం ద్వారా మంచి అధిక వస్తాయని, తద్వారా రైతులకు లబ్ధి జరుగుతుందని తెలిపారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన ఽశాస్త్రవేత్త శ్యాంప్రసాద్‌ మాట్లాడగా శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్‌, గణేష్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వానికి వారసులే అర్హులు

కారేపల్లి: మత్స్య సహకార సంఘం సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారి స్థానాన వారసులకే సభ్యత్వం ఇవ్వాలని మత్స్య శాఖ ఏడీ జి.శివప్రసాద్‌ స్పష్టం చేశారు. మండలంలోని మాధారంలో మత్స్య సహకార సంఘం సభ్యులతో ఏడీ గురువారం సమావేశమయ్యారు. ఉమ్మడి జీపీ పరిధిలో నాలుగు చెరువులకు గాను 71 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉండగా, వీరిలో 22 మంది మరణించారు. వీరి స్థానంలో బాధిత కుటుంబాల్లో వారసులకు కాకుండా డబ్బులు తీసుకుని సభ్యత్వాలు ఇస్తున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో సభ్యులతో సమావేశమైన ఏడీ.. వారసులకే సభ్యత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. సంఘం అధ్యక్షులు అజ్మీరా సూక్యా, సర్పంచ్‌లు ధరావత్‌ మంగీలాల్‌, అజ్మీరా ఉమానరేష్‌, గుగులోతు కృష్ణవేణి, ధరావత్‌ వెంకటేశ్వర్లు, సభ్యులు గుగులోతు రమేష్‌, వీరబాబు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement