13న భద్రాచలంలో పునరేకీకరణ ‘అభ్యర్థన సదస్సు’ | - | Sakshi
Sakshi News home page

13న భద్రాచలంలో పునరేకీకరణ ‘అభ్యర్థన సదస్సు’

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

ఖమ్మం సహకారనగర్‌: భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ గెజిటెడ్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌, టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎటపాక, పురుషోత్తమపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల జీపీలను ఏపీలో విలీనం చేయడం వల్ల భద్రాచలం కేవలం 10 చ.కి.మీకే పరిమితమైందన్నారు. తద్వారా అభివృద్ధికి ఆటంకంగా మారినందున తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో సామాజిక బాధ్యతగా డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు 13వ తేదీన తేదీన భద్రాచలం పాత ఆర్‌అండ్‌బీ భవనంలో ‘అభ్యర్థన సదస్సు‘నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యను రాజకీయ అంశంగా సామాజిక బాధ్యతగా చూస్తూ అందరూ హాజరుకావాలని కోరారు. అనంతరం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. టీజేఏసీ జిల్లా చైర్మన్‌ గుంటుపల్లి శ్రీనివాసరావు, బాధ్యులు కొణిదన శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, తుంబూరు సునీల్‌రెడ్డి, మల్లెల రవీంద్రప్రసాద్‌, పారుపల్లి నాగేశ్వరరావు, కట్టా శేఖర్‌రావు, సుబ్బయ్య, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

టీజీ ఈజేఏసీ సెక్రటరీ జనరల్‌,

టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ‘ఏలూరి’

Advertisement
 
Advertisement
Advertisement