నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

Apr 9 2026 7:29 AM | Updated on Apr 9 2026 7:29 AM

మధిర/ఎర్రుపాలెం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఎర్రుపాలెంలోని టీజీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. ఆతర్వాత ములుగుమాడులో రూ.365కోట్లతో చేపట్టే కట్టలేరు ఆధునికీకరణ రెండో విడత పనులకు శంకుస్థాపన చేయనన్నారు. అలాగే, మధ్యాహ్నం 12–30 గంటలకు మధిర మండలం మాటూరుపేట వద్ద అంబరుపేట – మాటూరుపేట బీటీ రోడ్డు, మల్లారం – మిట్టగూడెం బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, ఎన్పీడీసీఎల్‌ నూతన డివిజనల్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న భట్టి, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం, ఎస్‌పీఎం సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత మధిరలో ఇందిరమ్మ గృహాల పురోగతిపై సమీక్షించి, మధిరలో నిర్మించే మహాప్రస్థానం నమూనాలను పరిశీలిస్తారు. అనంతరం సాయత్రం 4–30 గంటలకు బోనకల్‌ రైతు వేదిక వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు డిప్యూటీ సీఎం సైకిళ్లు పంపిణీ చేస్తారు.

ఈవీఎం గోదాం వద్ద

పటిష్టమైన నిఘా

ఖమ్మం సహకారనగర్‌: ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆవరణలోని గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశాక సిబ్బందికి సూచనలు చేశారు. కలెక్టరేట్‌ ఏఓ కె.శ్రీనివాసరావు, ఎన్నిక ల డీటీ అన్సారీ, ఉద్యోగులు పాల్గొన్నారు.

క్రీడలతో శారీరక,

మానసిక దృఢత్వం

ఖమ్మంక్రైం: పోలీసులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వం సొంతమవుతుందని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆవరణలో ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు షటిల్‌ ఆడిన సీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, కుటుంబాలు కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నేడు ‘వనజీవి రామయ్య’ చిత్రబృందానికి సత్కారం

ఖమ్మంగాంధీచౌక్‌: ఇటీవల గద్దర్‌ అవార్డు గెలుచుకున్న ‘వనజీవి రామయ్య’ చిత్రబృందా న్ని గురువారం ఖమ్మంలో సన్మానించనున్నారు. జిల్లా అటవీ శాఖ, వాస్విక్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 10గంటలకు సన్మానం ఉంటుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేసి పద్మశ్రీ అవార్డు పొందిన వనజీవి రామ య్య జీవితచరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రానికి ప్రభుత్వం గద్దర్‌ అవార్డు ప్రదా నం చేసింది. ఈమేరకు చిత్రబృందానికి జరిగే సత్కారంలో అధికారులు, ప్రకృతి ప్రేమికులు, ప్రజలు పాల్గొనాలని డీఎఫ్‌ఓ కోరారు.

గ్యాస్‌ పైపులైన్‌

వేగవంతం చేయాలి

భ ద్రాద్రి కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు చేపట్టనున్న సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) పైపులైన్‌ విస్తరణ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమావేశమైన ఆయన మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ క్వాలిటీ ఇన్‌చార్జి రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పైపులైన్‌ రూట్‌ మ్యాప్‌, పనుల పురోగతి, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు సేకరించి సూచనలు చేశారు. భూసేకరణ, అనుమతుల మంజూరు, రోడ్ల తవ్వకాలు, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా 24 గంటల్లో అనుమతులు పొందే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, డిగ్‌ అండ్‌ రీస్టోర్‌ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌ కొరత నివారించేందుకు పీఎన్‌జీ సరఫరాను త్వరగా అందుబాటులోకి తీసుకురావా లన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నోడల్‌ అధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్‌ కుమార్‌ను నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement