ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం ప్రస్తుత సీజన్‌లోనే అత్యధికంగా 52 వేల బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. నిత్యం 32 – 35వేల బస్తాల మిర్చి తీసుకొస్తుండగా గత సోమవారం 45వేల బస్తాల మిర్చి తీసుకొచ్చారు. ఇక మంగళవారం సెలవు కావడంతో బుధవారం ఏకంగా 52 వేల బస్తాల మిర్చి రాగా యార్డు నలుదిక్కులా నిండిపోయింది. ఇదేసమయాన ధర కూడా కాస్త పుంజుకుంది. సోమవారం క్వింటాకు రూ.19,500 పలికిన ధర బుధవారం రూ.19,550కు చేరింది. మోడల్ ధర రూ.19 వేలుగా నమోదైంది. అంతేకాక తాలు మిర్చి ధర క్వింటా గరిష్టంగా రూ.10 వేలు పలకడం విశేషం. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి ప్రవీణ్‌కుమార్ క్రయవిక్రయాలను పర్యవేక్షించారు.


