కంటి ఆపరేషన్లు చకచకా.. | - | Sakshi
Sakshi News home page

కంటి ఆపరేషన్లు చకచకా..

Apr 9 2026 7:29 AM | Updated on Apr 9 2026 7:29 AM

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ల నిర్వహణలో వేగం పెరగనుంది. ఈమేరకు శస్త్రచికిత్సకు అవసరమైన ఏ–స్కాన్‌, బీ–స్కాన్‌ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కంటి విభాగంలో ఈ యంత్రాలను ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం.నరేందర్‌ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ యంత్రాల ద్వారా అత్యంత కచ్చితత్వంతో కంటి పరీక్షలు, ఆపరేషన్లు సాధ్యమవుతాయని తెలిపారు. అంతేకాక ఎక్కువ ఆపరేషన్లు చేయడానికి వీలవుతుతుందని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ బి.కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎంఓలు రాంబాబు, శ్రీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌, జిల్లా అంధత్వ నివారణ అధికారి, ఆప్తాల్మిక్‌ హెచ్‌ఓడీ రామూనాయక్‌, ప్రొఫెసర్‌ జయంతి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆయేషాబేగం, ఎస్‌కే. ఆస్మా, సీనియర్‌ రెసిడెంట్లు రవీనా, పావని, నందగిరి శ్రీను పాల్గొన్నారు.

రామయ్యకు స్నపన తిరుమంజనం

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్రోక్తంగా జరిపారు.

పెద్దాస్పత్రికి కొత్త యంత్రాలు

Advertisement
 
Advertisement
Advertisement