నేలకొండపల్లి: మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను జీవీకే ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ (జీవీకే ఈఎంఆర్‌ఐ) పోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాల పనితీరు, మందుల లభ్యత, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. కేంద్ర కార్యాలయం ఆడిటర్ ఫకీర్ దాసు, జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, నేలకొండపల్లి ఈఎంటీ పుష్ప, పైలట్ పాలడుగు రామకృష్ణ పాల్గొన్నారు.
ఏబీఏపీ జిల్లా
అధ్యక్షుడిగా కాటేపల్లి
కల్లూరు: అఖిల భార త అయ్యప్ప ధర్మ ప్రచారసభ (ఏబీఏపీ) జిల్లా అధ్యక్షుడిగా కల్లూరుకు చెందిన కాటేపల్లి రజనీకాంత్ ఎన్నికయ్యారు. ఖమ్మంలో మంగళవా రం ఈ ఎన్నిక జరిగింది. అలాగే, ఉపాధ్యక్షుడి గా లంకా అప్పలనాయుడు, కార్యదర్శిగా చిర్రా రవి, కోశాధికారిగా ఆళ్ల వెంకటేశ్వరరావుతో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా జనగామ తిరుపతి, గుండగాని ఉప్పలయ్య వ్యవహరించగా, రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లంరాజు, జోనల్ సెక్రటరీగా ఇస్లావత్ నగేశ్ పాల్గొన్నారు.
రెమ్యునరేషన్
బకాయిలు చెల్లించాలి
ఖమ్మంసహకారనగర్: గత ఏడాది ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం చేసి న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని స్పాట్ కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయాన నిరసన తెలిపి డీఈఓ చైతన్యజైనీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మూల్యాంకనం రేట్లు 50శాతం పెంచడమే కాక 2022, 2025 బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే, 2023లో కోత విధించిన డీఏ, సమగ్ర కుటుంబ సర్వే పైకం సైతం చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కట్టా శేఖర్, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్.విజయ్, వెంగళరావు, కరామత్ అలీ, రాములు, మన్సూర్, యాదగిరి, వెంకటరమణారెడ్డి, మంగ్యానాయక్, రవీంద్ర, విజయ్, అమృత్‌కుమార్, వెంకన్న, రాంబాబు పాల్గొన్నారు.


