●ఆస్పత్రులకు అవార్డుల పంట | - | Sakshi
Sakshi News home page

●ఆస్పత్రులకు అవార్డుల పంట

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆస్పత్రులు, వైద్యులు, ఉద్యోగులకు అవార్డులు ప్రకటించగా జిల్లా సత్తా చాటింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, వైద్యులు అవార్డులు అందుకున్నారు. ఈమేరకు ఉత్తమ ఆస్పత్రి అవార్డును ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎం.నరేందర్‌ స్వీకరించారు. అలాగే, బెస్ట్‌ ఆధార్‌ బేస్డ్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ వన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అవార్డు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శంకర్‌కు కోచ్‌లర్‌ ఇంప్లాంట్‌ విభాగంలో అవార్డు అందుకున్నారు. ఇక వీవీపీ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగపర్చడానికి చేస్తున్న కృషికి గాను డీసీహెచ్‌ఎస్‌ ఎన్‌.రాజశేఖర్‌ గౌడ్‌ అవార్డు స్వీకరించారు. అంతేకాక ఆధార్‌ బేస్డ్‌ అటెండెన్స్‌ నిర్వహణలో పెనుబల్లి, కల్లూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల వైద్యులు ఎన్‌.కిరణ్‌కుమార్‌, బి.శివకృష్ణ, రామ్‌శరణ్‌ అవార్డు అందుకున్నారు. ఇక క్షయ వ్యాధి పరీక్షలు, గుర్తింపు, నివారణలో ముందంజలో నిలిచిన సత్తుపల్లి మండలం గంగారం పీహెచ్‌సీ అవార్డుకు ఎంపికై ంది. ఈమేరకు వైద్యాధికారి ఆర్‌.అవినాష్‌ అవార్డు అందుకున్నారు. అలాగే, – ఖమ్మం వైద్యవిభాగం/సత్తుపల్లి టౌన్‌/పెనుబల్లి

Advertisement
 
Advertisement
Advertisement