ఖమ్మంమయూరిసెంటర్: పార్టీ అప్పగించిన పనిని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పూర్తి చేసేవరకు విశ్రమించని నిబద్ధత కలిగిన మార్క్సిస్టు యర్రా శ్రీకాంత్ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శ్రీకాంత్ వర్ధంతి సభ సోమవారం ఖమ్మంలోని బోస్ సెంటర్‌లో డివిజన్ కార్యదర్శి వై.విక్రం అధ్యక్షతన నిర్వహించగా తమ్మినేని మాట్లాడారు. గతంలో త్రీటౌన్ ప్రాంతం నుండి మార్కెట్ తరలకుండా పోరాడడమేకాక ఇళ్ల స్థలాల పోరాటంలో శ్రీకాంత్ ముందు నిలిచేవారని గుర్తు చేశారు. కాగా, నేడు జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో సీపీఎం పార్టీ స్పష్టమైన వైఖరితో పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌వి దురాక్రమ దాడులని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీపీఎం ఆలిండియా కమిటీ సభ్యుడు ఎం.సాయిబాబా, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడగా సభకు ముందు మార్కెట్ నుంచి బోస్ సెంటర్ వరుకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మడుపల్లి గోపాల్‌రావు, బండి పద్మ, జబ్బార్, మీరా, తిరుపతిరావు, ఎస్.నవీన్‌రెడ్డి, యర్రా రమేష్, యర్రా రంజిత్, యర్రా జ్ఞానేష్, యర్రా గోపి, భూక్యా శ్రీనివాసరావు, బండారు యాకయ్య, ఎల్లంపల్లి వెంకట్రావు, బండి పద్మ, పత్తిపాక నాగసులోచన పాల్గొన్నారు.
వర్ధంతి సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం


