ధాన్యం లారీ బోల్తా : క్లీనర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం లారీ బోల్తా : క్లీనర్‌ మృతి

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

తల్లాడ: తల్లాడ మండలం వెంగన్నపేట కల్లూరు వాగులో ఆదివారం అర్ధరాత్రి లారీ బోల్తా పడగా క్లీనర్‌ మృతి చెందాడు. వెంగన్నపేటలో ధాన్యం లోడ్‌ చేసుకున్నాక లారీలో ఏపీలోని రాజమండ్రికి వెళ్తుండగా బయలుదేరిన పది నిముషాల్లోనే లారీ వాగు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో అనకాపల్లి జిల్లా మడకపాలెంకు చెందిన క్లీనర్‌ మడక జోగేశ్వర్‌రావు(38) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, లారీ డ్రైవర్‌ సాలెపు సంతోష్‌కుమార్‌ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సాగర్‌ కాల్వలో గల్లంతైన వ్యక్తి..

కల్లూరు: మండల కేంద్రంలోని సాగర్‌ కాల్వలో ఈనెల 4వ తేదీన పడి గల్లంతైన వ్యక్తి సోమవారం మృతదేహమై తేలాడు. మండలంలోని నారాయణపురానికి చెందిన తొర్రికొండ వెంకటేశ్వర్లు(50) శనివారం గ్యాస్‌ సిలిండర్‌ కోసం వాచ్యానాయక్‌ తండా వెళ్లి వచ్చే క్రమాన ప్రమాదవశాత్తు వాహనంతో సమా సాగర్‌ కాల్వలో పడ్డాడు. ఆయన మృతదేహం పెద్దకోరుకొండి సమీపాన లభించగా కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

కత్లూరు: మండలంలోని రామకృష్ణాపురం వద్ద జాతీయ రహదారి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని రాళ్లబంజరకు చెందిన బానోత్‌ నాగరాజు (32) బైక్‌పై వెళ్తుండగా, ఏపీలోని జంగారెడ్డిగూడెంకు చెందిన మరో ద్విచక్ర వాహనదారుడు శ్రీరామ్‌ ఖమ్మం వైపు వెళ్తూ ఎదురుగా ఢీకొన్నారు. ఇదే సమయాన సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఐషర్‌ వాహనం నాగరాజు వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, శ్రీరామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై నాగరాజు భార్య కవిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement