జిల్లా అంతటితో పాటు ముదిగొండ మండలంలో కూడా రైతులు ఎక్కువగానే మొక్కజొన్న సాగు చేశారు. ఈనేపథ్యాన పంట కోత పూర్తికావడంతో తేమ తగ్గేలా మండలంలోని బాణాపురంలో ఇటీవల నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్డుపై ఆరబోశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న ఈ రోడ్డుపై మక్కలు ఆరబోయగా.. ఇటీవల ఎండలకు బాగా ఎండి గలగలలాడుతున్నాయి. అయితే, రాత్రి మక్కలను ఎత్తడం, ఉదయం ఆరబోయడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యాన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటుచేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు
కోరుతున్నారు. – ముదిగొండ


