ఖమ్మంమామిళ్లగూడెం: యాదవుల జనాభా 18 శాతం ఉన్నా అందుకు తగినట్లు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని.. ఈ విషయాన్ని గుర్తించి రాజకీయాలకతీతంగా యాదవులు సంఘటితమైతే భవిష్యత్‌లో రాజ్యాధికారం సిద్ధిస్తుందని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ తెలిపారు. అఖిలభారత యాదవ మహాసభ, గొర్రెలు, పెంపకందారుల జిల్లా సహకార సంఘం సంయుక్త ఆధ్వర్యాన నవీన్‌యాదవ్‌తో పాటు ఇటీవల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లుగా గెలిచిన యాదవులను ఆదివారం ఖమ్మంలో సన్మానించారు. నవీన్‌యాదవ్ మాట్లాడుతూ.. ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానని చెప్పారు. అనంతరం మల్లిబాబుయాదవ్, చిలకల వెంకట నరసయ్యయాదవ్, చిత్తారు సింహాద్రియాదవ్, పుచ్చకాయల వీరభద్రం, గంగదేవుల లోకేశ్‌యాదవ్, వాగదాని పుల్లారావు మాట్లాడుతూ.. నవీన్‌యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు జిల్లా యాదవులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అలాగే, గొర్రెల పెంపకందారులకు రుణాలు, ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా, ఖమ్మంలో గొర్రెల మార్కెట్ యార్డుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లోడిగ వెంకన్న, దుబాకుల వెంకటేశ్వర్లు, చంద్రకాని రమణ, తెల్లబోయిన వెంకటరమణ, మేకల మల్లికార్జునరావు, దుబాకుల శ్రీనివాస్, చేతుల నాగేశ్వరరావు, మొరిమేకల కోటయ్య, ముసలయ్య, వేణు, కుమార్, ఐలయ్య, మంద నాగేశ్వరరావు, పుట్ట ఉపేందర్, డేగల ఉపేందర్, అల్లిక అంజయ్య, బుక్కా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
సన్మాన సభలో ఎమ్మెల్యే నవీన్‌యాదవ్


