ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క – నందిని దంపతుల కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి వివాహ రిసెప్షన్ ఆదివారం ఖమ్మంలో వేడుకగా జరిగింది. ఖమ్మం వైఎస్సార్ కాలనీలోని గ్రీన్‌హిల్స్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు మాట్లాడుతూ గత నెల 5న హైదరాబాద్‌లో వివాహం జరగగా, జిల్లా ప్రజల ఆశీస్సుల కోసం ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. ఈమేరకు హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు.


