కూసుమంచి: కూసుమంచితో పాటు పలు గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ ఫేజ్–2 (29 ఆర్)లో కాలువ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కొన్నేళ్లుగా ఈ కాలువ పనులు నిలిచిపోవడంతో సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకరాగా ఆయన సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అవాంతరాలను పరిష్కరించి శుక్రవారం కాలువ తవ్వకం పనులు మొదలుపెట్టించారు. ఫలితంగా కూసుమంచితో పాటు గురువాయిగూడెం, పాలేరు, నానుతండాకు చెందిన రైతులకు కూడా సాగునీరు అందనుంది. ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించిన మంత్రికి ఆయా గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి పొంగులేటి చొరవతో పనులు


