ఖమ్మంసహకారనగర్: ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లా రైతాంగం సాగు చేస్తున్న వరి ధాన్యంలో 2.37 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, మిల్లర్లతో సమీక్షించారు. రైస్ మిల్లర్లు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకునేందుకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే, నాణ్యమైన గన్నీ సంచులనే కొనుగోలు కేంద్రాలకు అందించాలని తెలిపారు. మిల్ పాయింట్ వద్దే సంచుల నాణ్యత పరిశీలన ఉంటుందని వెల్లడించారు. కాగా, ధాన్యం రవాణాకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రభుత్వానికి సమర్పించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై సమీక్షించిన
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


