ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు బ్యాంకు లింకేజీతో ఆర్థిక మద్దతు, బ్యాంకు లింకేజీ లేని పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు తెలిపారు. అభ్యర్థులు tsobmms.cgg. gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఆతర్వాత దరఖాస్తు కాపీకిపత్రాలను జతచేసి ఎంపీడీఓ/మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
రేపు పాపన్న గౌడ్ వర్ధంతి
ఖమ్మం సహకారనగర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 2న నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈమేరకుఉదయం 10 గంటలకు ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, 3వ తేదీన దొడ్డి కొమురయ్య జయంతిని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నేడు పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు బుధవారం నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారు నేరుగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 8గంటలకు రిపోర్టు చేయాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన అధికారులు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు మంగళవారం సందర్శించారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్‌నాయక్ క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు. పురావస్తు శాఖ ఏఈ శంకర్, నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రీన్‌వే ఎన్విరాన్‌మెంటల్ సొసైటీ అధ్యక్షుడు దుడ్డెల రవి తదితరులు పాల్గొన్నారు.
జలవనరుల శాఖ సీఈగా వెంకటేశ్వర్లు
ఖమ్మంఅర్బన్: జిల్లా జలవనరుల శాఖ సీఈగా మంగళపూడి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న ఈఎన్‌సీ రమేష్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఖమ్మం ఎస్‌ఈగా ఉన్న వెంకటేశ్వర్లుకు సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన బుధవా రం బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది.


