రామయ్యకు వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు వసంతోత్సవం

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం వసంతోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి బేడా మండపంలోని నిత్యకల్యాణ వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర ప్రత్యేక పూజలు చేశాక, పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆపై మూలమూర్తులు, లక్ష్మీ అమ్మవారు, ఆండాళ్‌ అమ్మవారు, భద్రుని గుడి, ఆంజనేయ స్వామి వార్లకు చివరగా ఉత్సవ మూర్తులపై వసంతాన్ని చల్లారు. అంతేకాక నూతన వధూవరులైన సీతారామయ్యను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. అలాగే, సూర్యప్రభ వాహనంపై స్వామి వార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. కాగా, శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాల్లో చివరిరోజైన బుధవారం చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన స్వామి వారి నిత్యకల్యాణాలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement